
లేదు, కవిత రాయడం
వాయిదా వెయ్యలేవు
అమ్మకి రాయాల్సిన ఉత్తరంలాగా
కవిత రాసేదాకా
నీ మనసు కుదుటపడదు.
అమ్మకే కదా ఉత్తరం
ఎప్పుడన్నా రాద్దాములే అనుకుంటావుగాని
అంతకన్నా ముఖ్యమైన పని
మరేముంటుందిగనుక?
నువ్వు క్షేమంగా ఉన్నావని
అత్యవసరంగా చెప్పవలసింది
అమ్మకే కద.
అమ్మ నీకు నేర్పిన భాషలోనే
అమ్మకు ఉత్తరం రాసేటప్పుడు
అమ్మ తప్ప నీ మనసులో
మరేమీ ఉండదు.
ప్రపంచం గురించి అమ్మకెందుకు?
నువ్వు కులాసాగా ఉన్నావన్న
రెండు ముక్కలు చాలామెకి.
ఎలా ఉన్నావమ్మా
అని నువ్వడిగే రెండు మాటలు
చాలామెకి.
నీకు తెలుసు కదా
నీ ఉత్తరం అందినప్పటినుంచీ
ఆమె మళ్ళా మరో ఉత్తరం కోసం
ఎదురుచూస్తూనే ఉంటుంది.
18-2-2025
“ ప్రపంచం గురించి అమ్మకెందుకు?
నువ్వు కులాసాగా ఉన్నావన్న
రెండు ముక్కలు చాలామెకి”
❤️
ధన్యవాదాలు మాధవీ!
చాలాకాలం తర్వాత ఈ పలకరింపు మీనుంచి!
పరమసత్యం.అమ్మ మనసును గురువాక్యమంత సీదాసాదాగా చెప్పారండీ….
ధన్యవాదాలు మేడం
అమ్మ అమ్మే…💐💚🙏
ధన్యవాదాలు
నీ వుత్తరం అందిన దగ్గర్నుంచి ఆమె నీ మరో వుత్తరం కోసం చూస్తుంది!
ధన్యవాదాలు
అమ్మ, ఉత్తరం. 🙏
బహుశా ఎదురు చూస్తూనే ఉంటుంది.🙏
ధన్యవాదాలు సార్
నీ క్షేమం ఇంకెవరికి కావాలి కనుక 👌👌
ధన్యవాదాలు
అమ్మకు ప్రపంచంతో పనేముంది..నీ క్షేమం తప్ప..
అవును మేడం
హృద్యమైన కవిత . మనసుకు హత్తుకునేలా ఉంది . మీకు నమస్సులు .
ధన్యవాదాలు సార్
సార్
మీ ఉత్తరం కోసం ఎదురు చూసే అమ్మలెందరోఈ వసుధైక కుటుంబం లో .
ధన్యవాదాలు సార్
అమ్మ లాగా కవిత
అమ్మ నేర్పిన భాషలోనే రాసిన ఉత్తరం కవితగా మారినప్పుడే, మనం నిజంగా మాట్లాడుతున్నాం అనిపిస్తుంది. అప్పటికి మనలో ఆమె తప్ప మరొకరు ఉండరు. మన శబ్దంలో ఆమె నీడ ఉంటుంది. ఆమె కోసమే వ్రాసిన ఈ చిన్న కవిత, ఈ చిన్న ఉత్తరం, అసలు కవిత్వానికే అసలైన అర్ధాన్ని కలిగిస్తుంది. ప్రపంచం గురించి చెప్పాల్సిన అవసరం ఆమెకు లేదు. ఆమెకి మనం బాగున్నామన్న రెండు మాటలు చాలును. అలాగే, మనం ఆమెని ఎలా ఉన్నావమ్మా? అని అడిగే రెండు మాటలు కూడా ఆమె గుండెను తాకుతాయి. మన కవిత ఆమెకే ఉత్తరమైతే, ఆమె కూడా మళ్ళీ మరో కవిత కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఉత్తరం వచ్చిన క్షణం నుంచీ మరోసారి ఉత్తరం రాదా? అని ఆశపడుతూ కూర్చుంటుంది – ఆ నిశ్శబ్దపు వేచి చూడడమే ఈ కవిత్వపు మూలగమనంగా మారుతుంది. కవిత రాయడం వాయిదా వేయలేని పని కాదు. అది ఓ నిశ్శబ్దపు పిలుపు. తల్లి కోసం, మన కోసం, ముద్దైన అనుబంధం కోసం లిఖించాల్సిన ఉత్తరం.కవిత్వం అద్భుతం
శైలజ గారూ! నిజంగా ఒక కవితకు ఇటువంటి పాఠకులు, ఇటువంటి అనుభూతి, ఇటువంటి స్పందన లభిస్తే ఆ కవితకు అంతకన్నా కావల్సింది మరేముంది!