బైరాగి కవిత్వం పైన చేస్తున్న ప్రసంగ పరంపరలో భాగంగా కిందటి మూడువారాలు బైరాగి కవిత్వ నేపథ్యంగురించీ, హామ్లెట్ స్వగతం గురించీ ప్రసంగించాను. నిన్న 'రాస్కల్నికోవ్' కవిత గురించి ప్రసంగించాను.
ఆయన చిత్రాలు తెలుగువాళ్ళ సంపద
ఒక గ్రామం మొత్తం పూనుకుంటేనే ఒక మనిషి విద్యావంతుడవుతాడని ఒక ఆఫ్రికన్ సామెత. ఒక నగరం మొత్తం పూనుకుంటేనే ఒక పౌరుడు విద్యావంతుడవుతాడని పూర్వకాలపు గ్రీకులు భావించేవారు. డా.కొండపల్లి శేషగిరిరావుగారి జీవితప్రయాణాన్ని దగ్గరగా చూసినవాళ్ళకి ఒక దేశం మొత్తం పూనుకుని ఆయన్ని చిత్రకారుడిగా రూపొందించిందని అర్థమవుతుంది.
సర్వోత్తమ దార్శనికుడు
వేమన గురువు అంటే సాంప్రదాయిక అర్థంలో గురువు మాత్రమే కాదు. ఇప్పుడు మనకి అత్యవసరమైన జీవనవిద్యను ప్రతిపాదిస్తున్న గురువు అని కూడా. అంటే, చాలా మనకి సుపరిచితంగా, ఇంక వాటిల్లోంచి కొత్తగా ఏ అర్థాలూ స్ఫురించడానికేమీ లేదనే పద్యాల్లో కూడా వేమన మనకి సరికొత్తగా వినిపిస్తున్నాడు.
