
యాత్రానందం కూడా కావ్యానందం లాంటిదే. ఇక ఆ యాత్రల్లో కవిత్వం కూడా వినబడితే అంతకంటే కోరుకోవలసిందేముంది?
నేను ఇంతకుముందు మూడు యాత్రాకథనాల సంపుటాలు తీసుకొచ్చాను. నేను తిరిగిన దారులు (2011), నా చంపారన్ యాత్ర (2018), పాటలు పుట్టిన తావులు (2020).
ఆ దారిలోనే ఇప్పుడు ఈ పుస్తకం అందిస్తున్నాను. ఇందులో 2015 నుంచి ఇప్పటిదాకా రాసుకున్న యాత్రాకథనాలు 18 దాకా ఉన్నాయి. బ్రహ్మపుత్ర ఒడ్డున అసామీ కవిత్వం మొదలుకుని కేరళలో ఎజుత్తచ్చన్ నడయాడిన నేలమీద సంచరించిన క్షణాలతోపాటు కావేరి ఒడ్డున శ్రీరంగనాథుడి సన్నిధిలో గడిపిన కాలందాకా నా అనుభవాలు ఈ పుస్తకంలో పంచుకున్నాను. యాత్రలంటే సుదూరప్రాంతాలకే పోనక్కరలేదు. మన పక్కనుండే ఒక ఘంటసాల, ఒక చందవరం, ఒక కొండాపూర్ లు కూడా మనకు చాలా విషయాలు చెప్పగలవు. ఒక కొండల వరస, ఒక పాతరాతియుగపు పనిముట్ల లోయ, ఒక చిత్రకారుడి గృహం కూడా మనకు కొత్త అంతర్దృష్టిని ప్రసాదించగలవు. నలుగురు సహృదయులు కూడుకోవాలేగాని ఒక కొండకర్ల ఆవ కూడా మనం మునిగి తేలే ఒక సౌందర్యమహాసముద్రంగా మారిపోగలదు.
‘మునిగితేలాం’ నా యాత్రాకథనాల నాలుగవ సంపుటం. ఆండాళ్ ప్రేమించిన శ్రీరంగనాథుడికి ఈ రచన సమర్పిస్తూ మీతో పంచుకుంటున్నాను. దీన్నిక్కడ మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ మిత్రుల్తో పంచుకోవచ్చు.
ఇది నా 49 వ పుస్తకం.
కార్తిక శుద్ధ ఏకాదశి, 12-11-2024
Congratulations on the 49!
ధన్యవాదాలు రామ్ భాస్కర్!
‘మునిగితేల్తము.. we too
ధన్యవాదాలు
మీరు రచనా ప్రవాహం సర్
ధన్యవాదాలు వివేక్!
సర్ నమస్కారం,
తాయు మానవర్ గురించి, రమణ మహర్షి ,గాంధీ, శ్రీ రంగనాధుడూ,అమ్మవారూ, అడవిలో అందమైన నరసిమ్హుడూ, నేను గురించి అనుభూతి తో ఎంత బావుందో.
ధన్యవాదాలు సార్
శుభోదయం సర్ ..మీ ప్రయాణంలో మాకూ స్థానం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. కొత్త పుస్తకానికి స్వాగతం పలుకుతూ శుభాభినందనలు సర్
ధన్యవాదాలు మేడం!
Congrats సర్. తప్పక చదువుతాను.
ధన్యవాదాలు