రాజమండ్రి డైరీ

నలభయ్యేళ్ళ కింద రాజమండ్రిలో ఉన్నప్పుడు రాసుకున్న డైరీలో కొన్ని పేజీలు గతంలో ఇక్కడ మీతో పంచుకున్నాను. వాటిని ఒక పుస్తక రూపంలోకి తెచ్చి చాలారోజులే అయ్యింది. కిందటేడాది డిసెంబరులో సాహితీ వేదిక మిత్రులు రాజమండ్రిలో కలుసుకున్నప్పుడు ఆ పుస్తకం ఆవిష్కరిద్దాం అనుకున్నాను. కాని వీలు పడలేదు. అప్పణ్ణుంచీ కనీసం ఆన్ లైన్ ప్రతినైనా విడుదల చేద్దాం అనుకుంటూనే ఉన్నానుగాని, అది కూడా వీలవలేదు. ఎలాగైతేనేం ఈ రోజు ఈ పుస్తకం మీతో పంచుకుంటున్నాను.

ఈ ఉత్తరాలు ఇక్కడ నా బ్లాగులో పంచుకున్నాక ప్రసిద్ధ కవయిత్రి, భావుకురాలు మానస చామర్తి ఆ ఉత్తరాల పైన ఒక చిన్ని సమీక్ష తన వాల్ మీద పోస్టు చేసారు. ఆ సమీక్షని మరికొంత విస్తరించి ఈ పుస్తకానికి ముందుమాటగా రాసిచ్చారు. ఆమెకి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

ఈ చిన్ని పుస్తకాన్ని నా రాజమండ్రి మిత్రుడు సమాచారం సుబ్రహ్మణ్యానికి అంకితమిచ్చాను. ఆయన మీద ఒక వ్యాసం కూడా ఈ పుస్తకంలో చేర్చాను.

ఇది నా 46 వ పుస్తకం. దీంతో, ఉత్తరాలు, నాటకం, సంగీతరూపకం తప్ప, తక్కిన అన్ని సాహిత్యప్రక్రియల్లోనూ నా రచనలు వెలువడినట్టే.

మీరు ఈ రచనను ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

14-7-2024

21 Replies to “రాజమండ్రి డైరీ”

  1. rammohanthummuri – I am a writer, a poet, a head master, a fater, a husband, and a creative person. I primarily in telugu language.
    Thummuri says:

    అభినందనలు సర్ .

  2. చాలా చాలా సంతోషం సర్. ఈ పుస్తకం చదివి మీరూ జీవితంతో కొంత యుద్ధం చేశారన్న ఊహకే బలం తెచ్చుకున్న మిత్రులు కనీసం ఇద్దరు తెల్సు నాకు. తెలియక ఇంకెందరో. Thank you very much for writing this.
    నాకూ భాగం ఇచ్చినందుకు ఇంకా, ఇంకా. ❤️❤️

    1. నిజమే సార్! అప్పట్లో చలంగారిలోనే మునిగితేలుతూ ఉండేవాణ్ణి.

  3. Purva Phalghuni(పూర్వ ఫల్గుణి) – నమస్తే , నమస్కారం, పుట్టింది,కొంతవరకు పెరిగింది మద్రాస్ లో ఆ తరువాత హైస్కూల్,కాలేజీ జీవితం, తూర్పుగోదావరి జిల్లాలో, వివాహం అయినప్పటి నుంచి హైద్రాబాద్ లో నివాసం. బాల్యం నుంచి మా నాన్నగారు,అమ్మగారి ల ద్వారా, పుస్తకాలు చదవడం అలవాటు అయింది. నాన్నగారికి ఎందరో ప్రముఖ సాహితీవేత్తలతో పరిచయం ఉండేది. ఆవిధంగా ముఖ్యంగా కధా, నవలా సాహిత్యం పట్ల అబిలాష పెరిగింది. వివాహానంతరం శ్రీవారి వల్ల, అమ్మ లాంటి అత్తగారి తోడ్పాటుతో నా సాహిత్యాభిలాష నిర్విఘ్నంగా కొనసాగింది. 2010లో ఉద్యోగం నుండి, స్వచ్ఛంద పదవీ విరమణ చేశాను. చదవడమంటే ఇష్టం. అయినప్పటికీ కథలు రాయాలానే తపన తో రాసిన తొలి కథ కౌముది అంతర్జాల పత్రిక లో ప్రచురిచతమైంది. నవ్య,ఆంధ్రభూమి,స్వాతి,తెలుగు వెలుగు,విపుల,రచన,జాగృతి,ఉషాపత్రిక,సాహో వంటి వార,మాస పత్రికలలోనూ, ఆంధ్రప్రభ, సాక్షి, నమస్తే తెలంగాణ, మనతెలంగాణ వంటి దినపత్రికలలోనూ, విశాలాంధ్ర వారి దీపావళి సంచికలోనూ, అంతర్జాల పత్రిక లైన, కౌముది, మధురవాణి, సంచిక, రస్తా, సహరి, నిత్య, కథామంజరి, రవళి నెచ్చెలిలలో కూడా కథలు ప్రచురింపబడ్డాయి. అదే విధంగా మరికొన్ని కథలు ఇతర ప్రముఖ కథా సంకలనాల లో,ఆకాశవాణి లో కూడా (చదివినవి) ప్రచురించబడి పాఠకుల మన్ననలు పొందాయి చతుర మాసపత్రికలో తొలి నవల “జీవితం ఓ ప్రవాహం” ప్రచురణ అయింది. రెండవ నవల 'కాశీపట్నం చూడరబాబూ' జాగృతి వారపత్రికలో సీరియల్ గ వెలువడింది మూడవ నవల ‘ప్రయాణం’ ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం లో ప్రచురిచతమయింది. బహుమతుల వివరాలు: గో తెలుగు.కాం వారి హాస్య కథల పోటిలో ప్రథమ బహుమతి, ఫేస్బుక్ లోని కథ గ్రూప్ నిర్వహించిన కథల పోటిలో ప్రథమ బహుమతి, అమెరికా తెలంగాణా సంఘం (ATA) వారి సావనీర్ కు పెట్టిన కథల పోటిలో మొదటి బహుమతి, వంగూరి ఫౌండేషన్ వారి మధురవాణి.కాం వారు నిర్వహించిన పోటిలో మేనిక్విన్ కథకి ఉత్తమ కథ బహుమతి, హాస్యానందం వారి పోటి లో కన్సొలేషన్ బహుమతి వచ్చాయి. అంతర్జాల పత్రికలయిన సహరి, కథా మంజరి, తెలుగుతల్లి డే కెనడా వారి పోటీలలో కూడ బహుమతులు వచ్చాయి తురగా ఫౌండేషన్ వారు నిర్వహించిన కథల పోటీ లో ఉత్తమబహుమతి, విశాఖ సంస్కృతి వారు నిర్వహించిన కథల పోటీలో ఉత్తమ బహుమతి, విశాలాక్షి మాసపత్రిక నిర్వహించిన కథల పోటీ లో మొదటి బహుమతి, నమస్తే తెలంగాణ ముల్కనూరు ప్రజా గ్రంధాలయం వారి పోటీ లో ప్రోత్సాహక బహుమతి, కౌముది అంతర్జాల పత్రికలో ప్రోత్సాహక బహుమతి ప్రకటించారు. ఇప్పటి దాకా రాసిన కథల సంఖ్య దాదాపుగా వంద కు పైన ఉన్నాయి మొదటి పుస్తకం వాత్సల్య గోదావరి (కథల సంపుటి) రెండవ పుస్తకం కాశీ పట్నం చూడర బాబు(నవల) నా మూడవ పుస్తకం 'మనం' ( కథల సంపుటి) నాలగవ పుస్తకం 'గెలుపు గాయాలు'(కథల సంపుటి) ఐదవ పుస్తకం పథికుడు(నవల)
    mani vadlamani says:

    రాజమండ్రి అంటే నే ఓ వైబ్రేషన్, అలాంటి మీ అక్షరాలలో గోదావరి తరంగాలను చూస్తూ , వింటూ ఓ ఆనంద పారవశ్యం అనుభవిస్తూ, అనుభూతి పొందుతూ.. అది అనంతం

  4. అభినందనలండీ. తప్పకుండా చదువుతాను.
    లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు🙏

  5. మీ తొలి జీవితంలో రాజమండ్రి ఎంత ప్రభావాన్ని చూపిందో… మీ రచనల్లో చదివాను. రాజమండ్రి, గోదావరి, చినవీర… ఆంధ్రులకు ప్రత్యేకం, సతత హరితం 💚

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%