ఆ ఉత్తరం

ఆషాఢ ప్రథమదివసం నాడు
ఒక నది ఒడ్డున నిల్చున్నాను
ప్రతి ఏడూ ఈ మొదటిరోజున
నాకోసం ఒక ఉత్తరమొస్తుంది.

రేవునిండా కిక్కిరిసిన జన
సందోహం. ఒక్కళ్లకీ తెలీదు,
ఇప్పుడిక్కడ మేఘమొక
వుత్తరం జారవిడుస్తుందని.

చూస్తూండగానే ఎక్కడికక్కడ
నింగినిండా పైకెత్తిపట్టుకున్న
లాంతర్లు. అర్థమయింది, ఆ
ఉత్తరం కింద చదువుకునేది కాదు.

7-7-2024

17 Replies to “ఆ ఉత్తరం”

  1. Wah! Wah!!!
    ఆ పెయింటింగ్….ఆ మబ్బు తునక…ఆ చీర కట్టుకున్నావిడ…బ్యూటిఫుల్!!❤️❤️

  2. rammohanthummuri – I am a writer, a poet, a head master, a fater, a husband, and a creative person. I primarily in telugu language.
    Thummuri says:

    చిత్రమూ ఉత్తరమూ ఒకదానికొకటి పోటాపోటీగా

    1. నీవంటి సహృదయులు చదవటమే ప్రత్యుత్తరం.

      1. ఆ ఉత్తరానికి మీ ప్రత్యుత్తరం కూడా ఒక చిత్రమైతే ఎంత సమ్మోహనమో

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%