పునర్యానం-49

స్వస్థత (స్వ+స్థ) అంటే నీలో నువ్వు ఉండడం. నీకు నువ్వుగా ఉండడం. నీలోంచి నువ్వుతప్పిపోవటమే అనారోగ్యం.  తిరిగి ఎవరైనా నిన్ను నీకు అప్పగిస్తే, నీలో శకలాలుగా విడిపోతున్న భావోద్వేగాలను ఒకచోటకు చేర్చి నిన్ను మళ్లా సమగ్రంగా నిలబెట్టగలిగితే అంతకు మించిన చికిత్స మరొకటి లేదు.

పునర్యానం-48

కేవలం అనుభవాల్నే రచనలుగా మార్చడం మీద నాకు ఆసక్తి లేదు. ఆ అనుభవాలు నా గురించో, ప్రపంచం గురించో ఏదో ఒక కొత్త సత్యానికి చేర్చగలవన్న నమ్మకం ఉంటేనే వాటిని కథలుగానో, కవితలుగానో మార్చడానికి పూనుకుంటాను.

ప్రతి ఒక్కరిదీ ఒక జయగాథ

నిన్న ఆ సభకి హాజరై తమ అనుభవాల్ని పంచుకున్న ప్రతి ఒక్కరూ వింటున్నవాళ్ళల్లో ఉత్తేజాన్ని ప్రవహింపచేసారు. వాళ్ళల్లో ప్రతి ఒక్కరిదీ ఒక జయగాథ. తెల్లవారిలేస్తే ద్వేషంతోనూ, ట్రోలింగుతోనూ కుతకుతలాడిపోతుండే మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ కనిపించని కథలు, వినిపించని విజయాలు.

Exit mobile version
%%footer%%