రోహిణికార్తె చివరిదినాలు. పొద్దున్న పదిగంటలకే ఫైరింజనువాళ్ళ సైరనులాగా ఎండ.
మొదటి కట్
ఈ రోజు సంస్కృతి రూరల్ ఆర్ట్ సెంటర్ లో లినోకట్ క్లాసుకి వెళ్ళాను. ప్రసిద్ధ చిత్రకారులు, ఆర్ట్ సెంటర్ మార్గదర్శకులు బొమ్మారెడ్డి అప్పిరెడ్డిగారి పర్యవేక్షణలో మొదటి కట్ పూర్తిచేసాను.
కోనసీమనుంచి కాలిఫోర్నియా దాకా
సాయి బ్రహ్మానందం రాసిన కథలు చదివేక సాహిత్యం వల్ల తన సంస్కారం, సంస్కారం వల్ల తన సాహిత్యం రెండూ కూడా బలపడ్డ ఒక రచయితని కనుగొన్న భావన కలిగింది. ఆ రచయిత పట్ల అపారమైన గౌరవం కలిగింది. ముఖ్యంగా, ఇందాకే చెప్పానే, ఆ కథ- 'లవ్ ఆల్' రాసిన కథకుడు తెలుగు కథకుడు అయినందుకు గర్విస్తున్నాను కూడా.
