ఆషాఢమేఘం అనగానే కాళిదాసు మేఘసందేశం గుర్తుకు రావడం సహజం. ఈ దేశంలో కవులకీ, భావుకులకీ శతాబ్దాలుగా ఒక అభిరుచిని అలవరచడంలో, ఋతుపవనాన్ని ఒక శుభాకాంక్షగా మనం గుర్తుపట్టేలా చెయ్యడంలో మేఘసందేశ కావ్యం పోషించిన పాత్ర చిన్నది కాదు. కాని ఋతుపవనాన్ని ఒక కావ్యవస్తువుగా స్వీకరించడంలో, మనుషుల హృదయాల్ని మెత్తబరచడంలో, నింగినీ, నేలనీ ముడిపెట్టడంలో మేఘసందేశం తొలికావ్యం కాదు.
