పునర్యానం కావ్యాన్ని నిర్మించడానికి నాకు తైత్తిరీయ ఉపనిషత్తు దారి చూపించింది. అందులో వివరించిన పంచకోశ జాగృతి వెలుగులో నా జీవితానుభవాన్ని పరిశీలించుకున్నాను.
పునర్యానం-1
నిర్వికల్ప సంగీతం కవిత్వం సంపుటి వెలువరించిన తర్వాత నాకొక కావ్యం రాయాలనిపించింది. వచనకవిత్వంలో దీర్ఘకావ్యాలు అప్పటికి రాసినవాళ్ళు లేకపోలేదు. కాని నా ఊహ వేరే విధంగా ఉండింది. అదొక ఇతిహాసాన్ని తలపించేదిగా ఉండాలనే ఆకాంక్ష చాలా బలంగా ఉండేది
మూడు దశలు
చదవగా, చదవగా నాకేమి అర్థమయిందంటే, చిత్రలేఖనంలో మూడు దశలున్నాయని.
