ఆషాఢమేఘం-15

గాథాసప్తశతిలో కనిపించే స్త్రీపురుషప్రేమకీ తర్వాత రోజుల్లో కావ్యప్రపంచాన్ని పరిపాలించిన ప్రేమకీ మధ్య చాలా తేడా ఉంది. ప్రాకృత కవిత్వంలో కనిపించే ప్రేమ స్త్రీపురుషుల మధ్య సహజంగా వికసించే అత్యంత లౌకిక ప్రేమ, గ్రామీణ ప్రేమ. దేహాలనూ, మనసులనూ కలిపే ప్రేమ.