ఇష్ట కవిత్వం

ఎందుకంటే సాహిత్య చరిత్ర చదివి ఆధునిక పాశ్చాత్య కవిత్వం లేకపోతే ఆధునిక తెలుగు కవిత్వం లేదనుకుంటూ ఉన్నాం. కాని యూరపియన్ దుఃఖానికి మరీ అంతలా ఋణపడకుండానే తెలుగులో ఇంత అద్భుతమైన కవిత్వం వికసించిందని ఈ పుస్తకం మనకి స్పష్టంగా గుర్తుచేస్తోంది.

ఒక ప్రయోగశీలి

ఇప్పటికీ, ఇన్నేళ్ళ తరువాత కూడా నాకు ఒక కవిని ఇంటికి వెళ్ళికలుసుకుంటే ఆ రోజు ఆకాశంలో ఎగిరి వచ్చినట్టుంటుంది. ఒక చిత్రకారుణ్ణి అతని స్టూడియోలో కలుసుకుని వస్తే గరుత్మంతుడిలాగా నాక్కూడా ఇంత అమృతాన్ని దొంగిలించి తెచ్చుకున్నట్టుగా ఉంటుంది.