దివ్యప్రేమగీతం-1

ఈ ఉద్యానంలో దేవుడి ప్రస్తావన లేదు, నిజమే, కాని సైతాను కూడా లేడు. మనిషికీ, మృగానికీ మధ్య విరోధం లేదు. ఆధిపత్యం లేదు, ఒకరినొకరం అణచివేసుకోడం లేదు. కాబట్టి ఆ ఉద్యానమే ఒక దైవం. దేవుడి ప్రస్తావనలేని దైవానుభవం ఈ గీతం.

మెరుగైన బేరం

మామూలుగా మనం ఏమనుకుంటామంటే ప్రేమ లెక్కల్నీ, లాభనష్టాల్నీ చూసుకోదని. కాని ప్రేమకి తనదే అయిన ఒక అంకగణితం ఉంది. ప్రేమికులు తమ ప్రేమనీ, ప్రపంచాన్నీ తక్కెడలో వేసి చూసుకున్నాకనే, ప్రేమ ప్రపంచం కన్నా ఎన్నో రెట్లు విలువైందని గ్రహించాకనే ప్రపంచాన్ని పక్కకు నెట్టేస్తారు.

అనువాదం ఒక కెరీర్ కూడా

సముద్రాన్ని గుట్టలుగా పోసినట్టు మనచుట్టూ పోగవుతున్న సాహిత్య, సాహిత్యేతర వాజ్ఞ్మయాన్ని తెలుగుచేయడానికి ఒకరో, ఇద్దరో, పదిమందో అనువాదకులు చాలరనీ, పదివేల మంది సైన్యం కావలసి ఉంటుందనీ కూడా చెప్పాను.