ఆ మనుషులు, వాళ్ళ అన్వేషణ, వాళ్ళ ప్రేమౌదార్యం- కొన్ని ఘట్టాలు, కొన్ని వాక్యాలు, చివరికి కొన్ని పదప్రయోగాలదగ్గర కూడా నేను నిశ్చేష్టుడిగా నిలబడిపోయాను. ఏరీ అటువంటి మనుషులు? ఏదీ అటువంటి పరస్పర ప్రేమాలింగనం? ఏవీ అటువంటి విలువలు? ఎట్లాంటి కాలంలో జీవిస్తున్నాన్నేను? నాకు దుఃఖం ఆగలేదు.