వినయపత్రికలో ఏ కీర్తన తెరిచినా ఇలా గంగ మన బల్లమీద ప్రవహిస్తున్నట్టే ఉంటుంది. పుస్తకం పుటల్లోంచి సూర్యోదయం సంభవిస్తున్నట్టే ఉంటుంది. నీ రెండు భుజాల మీదా రెండుకోకిలలు, ఒకటి వాల్మీకి కోకిల, మరొకటి తులసీ కోకిల గొంతెత్తి కూస్తూనే ఉన్నట్టుంటుంది.
నా కాశీయాత్ర-2
మంగళవాద్యాల, శంఖతాళాల మధ్య బిగ్గరగా పాడుతున్న హారతిగీతాల మధ్య దేదీప్యమానమైన దీపాల వెలుగు, రంగురంగుల దీపాలు, ఆ దీపకాంతిలో లక్షలాది రంగుల్లో యాత్రీకులు, వారి వదనాలన్నీ నీటిమీద కలిసిపోతున్న నీటిరంగుల్లాగా అలుక్కుపోయి ఆ ఒడ్డంతా ఒక ఇంద్రచాపం పరిచినట్టుగా అనిపించింది.