తెంపులేని రాగధార

నిన్న ట్రాన్స్ ట్రోమర్ కవితలు మూడు అనువదించాక ఆ అనువాదం ఒక సవాలుగా తోచింది. తెలుగు కవిత్వాన్ని యుగాలుగా మన కవులు శబ్దాడంబరంతో బరువెక్కించేసారు. అందుకనే కవిత్వంలో నిశ్శబ్దం గురించి ఇస్మాయిల్ గారు అంతగా కొట్టుకుపోయేడు.

రూపకప్రజ్ఞ

'మీరు కవిత రాసేముందే మెటఫర్లు పట్టుకుంటారా లేకపోతే కవితరాస్తూండగానే అవి కూడా దొర్లుకొస్తాయా' అనడిగిందొక మిత్రురాలు. ఒకప్పుడు కవిత అంటే శబ్దం, సంగీతం.