ద వీవర్స్

గెర్టార్ట్ హౌప్ట్ మన్ 'ద వీవర్స్' (1892) చదవడం పూర్తి చేసాను. ఈ రచన గురించి మొదటిసారి 'జర్మన్ సంప్రదాయ సాహిత్య దర్పణం' లో చదివాను. ముప్ఫై ఏళ్ళ కిందట. నాటకంలోంచి ఒక చిన్న భాగం అనువాదం కూడా ఉందందులో. మొత్తం నాటకం కోసం వెతికినప్పుడు గౌతమీ గ్రంథాలయంలో Sixteen European Plays దొరికింది, మోడర్న్ లైబ్రరీ వాళ్ళ ప్రచురణ.