యుగయుగాల చీనా కవిత-23

కాలంలో వస్తున్న మార్పుని అందరికన్నా ముందు చిత్రకారుడు, ఆ తర్వాత సంగీతకారుడూ, ఆ తర్వాత కవీ పట్టుకుంటారు. తాత్వికుడూ, సోషియాలజిస్టూ, కాలమిస్టూ ఆ తర్వాతే దాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ ఆ కవి శబ్దవర్ణచ్ఛాయలతో కవిత్వం పలికేవాడూ, ఆ కవితలో ఆ భాషకే సొంతమైన స్వరాల్నీ, ధ్వనుల్నీ పట్టుకోగలిగేవాడూ అయితే, ఇంక చెప్పవలసిందేముంది!