శివలెంక రాజేశ్వరీదేవి

శివలెంక రాజేశ్వరీదేవి కవితాసంపుటి ‘సత్యం వద్దు, స్వప్నమే కావాలి' (ప్రేమలేఖ ప్రచురణ, 2016) కి ఈ ఏడాది ఇస్మాయిల్ కవిత్వ పురస్కారం ప్రకటించారు. ఆదివారం సాయంకాలం కాకినాడలో ఇస్మాయిల్ మిత్రమండలి ఏర్పాటు చేసిన ఆ పురస్కార సభకి అధ్యక్షత వహించేను. కాకినాడ రోటరీ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన ఆ సభలో ఇస్మాయిల్ గారి కవిత్వంగురించి డా.కాళ్లకూరి శైలజగారు, ఆయన సాహిత్యవ్యాసాల గురించి చినుకు పత్రికా సంపాదకులు నండూరిరాజగోపాల్ గారు మాట్లాడేరు. పురస్కారం పొందిన పుస్తకం గురించి, ఆ కవిగురించి మాట్లాడే బాధ్యత నాకు అప్పగించారు.

ఇద్దరు ఆత్మీయులు

డా.యు.ఏ. నరసింహమూర్తి పూర్ణమానవుడు. తెలుగు రసజ్ఞ ప్రపంచంలో మన సమకాలికుల్లో సాలప్రాంశువు. ఏ సాహిత్యం ప్రశంసలోనైనా, సాహిత్యమీమాంసకైనా ఏ సంతోషం వచ్చినా, సందేహం వచ్చినా నాకొక పెద్దదిక్కుగా నిలబడ్డ మనిషి.