రూమీ గురించి నేను రాసిన నాలుగు మాటల్నీ మిత్రులు ఎంతో ఇష్టంతో చదవడం నాకు చాలా సంతోషానిచ్చింది. ముఖ్యంగా గోపరాజు వెంకటరమేష్ గారి ప్రతిస్పందనకి నేను కైమోడ్చకుండా ఉండలేకపోయాను. అయితే ఆయన రూమీ మాట్లాడిన ప్రేమ మనుషులకే పరిమితమా, తక్కినవాటికి అందులో చోటులేదా అనడిగారు