ప్రియమైన శాఫో, భాష అంటే ఏమిటి? అక్షరం. ఎన్నటికీ నశించినదనే కదా. కాలం తాకిడికి చెక్కుచెదరనిదనే కదా. నువ్వు ఆఫ్రొడైటుని ప్రార్థిస్తూ రాసిన ఈ గీతాన్ని ఇరవై ఆరుశతాబ్దాల పాటు చెక్కుచెదరకుండా కాపాడింది, అదే కదా, 'మాటలనియెడు మంత్రశక్తి.'
ప్రియమైన శాఫో-2
నీలో ఆ అందం దేనిది- నీ రూపానిదా, నీ పాటలదా, నీ సంగీతానిదా, నీ మనసుదా అని కదా అనుకున్నాను మొన్నంతా. ఆ ఉత్తరం రాసి పోస్టు చేసినప్పణ్ణుంచీ నా ఆలోచనలు నువ్వు రాసిన మరో కవిత చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ కవితలో నువ్వు ఇదే ప్రశ్న అడిగావు: ఈ ప్రపంచంలోకెల్లా చాలా అందమైంది ఏదని.
ప్రియమైన శాఫో-1
పొద్దుణ్ణుంచీ నీచుట్టూతానే నా తలపులు. కాని ఎక్కడ మొదలుపెట్టాలో, ఏమని సంబోధించాలో, ఏమి రాయాలో తెలియడం లేదు. నా పాతికేళ్ళప్పుడు ఎన్ని ఉత్తరాలు రాసేవాణ్ణి. జవాబులు రావని తెలిసినా కూడా రాస్తూనే ఉండేవాణ్ణి. అప్పుడు నువ్వెక్కడున్నావు?
