అభంగం. బహుశా ఛందస్సుల్లో ఇంత అందమైన పేరు మరే ఛందస్సుకీ లేదనిపిస్తుంది. భంగపాటు తప్ప మరేమీ దొరకని ఈ జీవితంలో అభంగం ఒక్కటే నిజమైన నీడ, ఓదార్పు.
అమృతానుభవం
అనుభవామృతాన్ని తెలుగు చేయడానికి రాధాకృష్ణమూర్తిగారికన్నా తగినవారు ఎవరుంటారు? ఉపనిషత్తులూ, భగవద్గీతలతో పాటు ఆధునిక పాశ్చాత్య చింతనని కూడా సాకల్యంగా అర్థం చేసుకుని సమన్వయించుకోగలిగిన ఆ వేదాంతి చేతులమీదుగా వెలువడటం కోసమే ఆ పుస్తకం ఇన్నాళ్ళుగా నిరీక్షిస్తూ ఉన్నదని అర్థమయింది
అమృతానుభవం చెంత
సంత్ జ్ఞానేశ్వర్ రాసిన అమృతానుభవాన్ని తెలుగులోకి అనువదించమని గంగారెడ్డి చాలాకాలంగా అడుగుతున్నాడు. ఆ పుస్తకాన్ని ఎవరైనా మరాఠీ పండితుడి ద్వారా ఒక్కసారైనా విని ఆ పనికి పూనుకుంటానని చెప్తూ వచ్చాను. నిన్నటికి ఆ అవకాశం దొరికింది. మాకోసం పల్దెప్రసాద్ అదిలాబాదులో ఒక మరాఠీ పండితుణ్ణి వెతికి పెట్టాడు. నిన్న పొద్దున్న రవీంద్రకుమారశర్మగారి కళాశ్రమంలో చావర్ డోల్ గిరీష్ అనే పండితుడు తానే స్వయంగా మా దగ్గరకొచ్చి అమృతానుభవం లోంచి కొన్ని ఓవీలు వినిపించి వాటి ప్రతిపదార్థ తాత్పర్యం వివరించాడు.