నర్మద దర్శనం

ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే, మొన్న సంధ్య ఎల్లాప్రగడ మా ఇంటికి వచ్చారు. కొంతసేపు కూచున్నారు. ఆమె ఆధ్యాత్మిక సాధనగురించీ, ఆమె చేస్తున్న తీర్థ యాత్రల గురించీ నేనే ఆమెతో ఏదో మాట్లాడిస్తో ఉన్నాను. కొంతసేపు కూచున్నాక, ఆమె సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. కాని ఒక కస్తూరి పరిమళం వదిలిపెట్టి వెళ్ళిపోయారు.

ఆమె నడిచిన దారి

అటువంటి సాక్షాత్కారంకోసం పడిన తపనలో మాత్రం సాధకులందరి అనుభవం ఒక్కలాంటిదే. అక్కడ ఏ ఒక్క సాధకుడి అనుభవమైనా తక్కిన సాధకులందరికీ ఎంతో కొంత ఊరటనిచ్చేదే, ధైర్యం చెప్పేదే, దారిచూపించేదే.