ఈ ఉత్తరాల్లో కూడా ఆ వ్యక్తిత్వమే

చలం నుండి చండీదాస్ దాకా సుప్రసిద్ధ తెలుగు రచయితలు, విమర్శకులు, సంపాదకులు ఎందరో ఆర్.ఎస్.సుదర్శనంగారికి రాసిన లేఖల్ని 'సుదర్శనం గారికి' (2017) పేరిట శ్రీమతి వసుంధరాదేవి సంకలనం చేసి ప్రకటించారు.

చక్రాల వెంకట సుబ్బుమహేశ్వర్

మా మిత్రుడూ, నాకెంతో ఆత్మీయుడూ మహేష్ నిన్న రాత్రి చెన్నైలో ఈ లోకం వదిలిపెట్టివెళ్ళిపోయాడు. నిన్నసాయంకాలమే సురేష్ బాబు ఫోన్ చేసినప్పుడే నేనీ వార్త వినడానికి మానసికంగా సిద్ధపడిపోయాను. పొద్దున్నే కుప్పిలి పద్మ, కొప్పర్తి, వొమ్మి రమేష్.. రాజమండ్రి మిత్రులంతా ఫోన్ చేస్తూ ఉన్నారు.

దృక్పథం ఒకరిస్తే ఏర్పడేది కాదు

వారం పదిరోజుల కిందట నాకో యువకుడు పోన్ చేసాడు. 'మీకు నేను ఏడెనిమిదేళ్ళ బట్టీ ఫోన్ చెయ్యాలనుకుంటున్నాను. ధైర్యం చాలింది కాదు. ఈ నంబరు నా దగ్గర చాలా ఏళ్ళుగా ఉంది. కాని ఇప్పటికి మీతో మాట్లాడ గలుగు తున్నాను' అన్నాడు.