గురువు ఒక థెరపిస్టు

ఆన్ లైన్లూ, డిజిటల్ పరికరాలూ, పుస్తకాలూ, వర్కు బుక్కులూ ఒక ఉపాధ్యాయుడికి ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేవని కరోనా మనకి పూర్తిగా రుజువు చేసింది. నువ్వేమీ చెయ్యకపోయినా పర్వాలేదు. పిల్లవాడూ, నువ్వూ తరగతిగదిలో ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నా కూడా అదే గొప్ప అభ్యసన కార్యక్రమం.

గురూజీ మాటలు మరికొన్ని

నేనా రోజు ఆ అర్థశాస్త్రవేత్తలకి ఆ కథంతా చెప్పి ' ఈ దేశంలో బీదరికం ఎవరి పాపం అని అడుగుతున్నారు కదూ. ఈ ఘోరాన్ని చూస్తూ తలకొక మాటా మాట్లాడుతున్న మీదే ఈ పాపమంతానూ' అన్నాను.

మరికొన్ని మంచిమాటలు

గురూజీ గురించి తలుచుకోవలసింది, ఆయన చెప్పిన మాటల్ని మళ్ళా మళ్ళా మననం చేసుకోవలసిందీ చాలా ఉంది. కొన్ని కొన్ని మాటలమీద కొన్నేళ్ళ పాటు చర్చించుకోవలసి ఉంటుంది. 

దలైలామా సహచరుడైన రింగ్ పోచే కళాశ్రమాన్ని చూసి 'మీరు గాంధీజీ హింద్ స్వరాజ్ పుస్తకంలో ఏమి రాసారో అచ్చం అలానే జీవిస్తున్నారు ' అని అన్నాడట.