అల నన్నయకు లేదు

నూటొక్క డిగ్రీల వైరల్ జ్వరంతో మంచం మీద పడి కునారిల్లుతున్న నాకు ఒక జిజ్ఞాసువునుంచి రెండు మిస్డ్ కాల్స్. ఏమిటని పలకరిస్తే 'ఒక పద్యం రిఫరెన్సు కావాలి మాష్టారూ, విశ్వనాథ వారి పద్యం 'అల నన్నయకు లేదు, తిక్కనకు లేదా భోగము..'అనే పద్యం ఎక్కడిదో చెప్తారా' అని.

మోయలేని బాధ్యత

శ్యామలానగర్ మొదటిలైన్లో మూడవ ఇల్లు, వానజల్లు మధ్య ఇంట్లో అడుగుపెడుతూనే రాలుతున్న పారిజాతాలు పలకరించాయి. అత్యంత సుకుమారమైన జీవితానుభవమేదో నాకు పరిచయం కాబోతున్నదనిపించింది.