నిర్వికల్పసంగీతంలోంచి కొన్ని కవితలు ఇంగ్లిషు చేద్దామనిపించింది. ఇది 43 ఏళ్ళ కింద రాసిన కవిత. మళ్ళా చదివితే ఫ్రెష్ గానే అనిపించింది. అందుకని ఇలా ఇంగ్లిషు చేసాను, మీతో పంచుకోడానికి.
కవిత్వం రాసుకోవడం
కవిత్వం రాసుకోవడం ఒక ప్రథమ చికిత్స. జీవితం గాయపరిచినప్పుడల్లా ఏదో ఒకటి చేసి ముందు రక్తం కారకుండా చూసుకోడం
వానలు పడుతున్నంతసేపూ
వానలు పడుతున్నంతసేపూ పడవలు వచ్చి ఆగుతుంటాయి. వెయ్యి తలుపులు ఒక్కసారి తెరుచుకున్నట్టు వేలాది పడవలు. ..
