కొన్ని సమయాలు నన్నెందుకు నిశ్చేష్టుణ్ణి చేస్తాయో కొన్ని నిశ్శబ్దాలు, కొన్ని జాడలు. అపరాహ్ణ వేళనీడ ఒక్కటి చాలు నన్ను పూర్తిగా మైమరిపించేటందుకు.
జలాలుద్దీన్ రూమీ
కోకిల ప్రవేశించే కాలం (2009) నుంచి మరో కవిత, నా ఇంగ్లిషు అనువాదంతో. ఆ రోజుల్లో నన్ను రూమీ పూర్తిగా ఆవహించి ఉన్నాడు.
ఈ కాలమే అలాంటిది
లెక్కపెట్టాను. మొత్తం పందొమ్మిది. నాసరరెడ్డి పందొమ్మిది కవితల్లాగా పందొమ్మిది గులాబి మొక్కలు.
