అలా బొమ్మలు గియ్యాలంటే ఎలా?

కాని ఇంత దూరం ప్రయాణించినా యూరపియన్-అమెరికన్ చిత్రకళకి తృప్తి లేదు. చీనాలో ప్రాచీన చిత్రకారులు చిత్రించిన కొండల్నీ, వెదురుపొదల్నీ, పువ్వుల్నీ, సీతాకోక చిలుకల్నీ చూసినప్పుడల్లా ఆధునిక చిత్రకారుడు అశాంతికిలోనవుతూనే ఉన్నాడు. ఎలాగు? అలా బొమ్మలు గియ్యాలంటే ఎలా?