అదిగో నవలోకం

ఇన్నాళ్ళయ్యాక అప్పుడు విన్న పాటల్లో ఏవి సుశీలపాడినవి, ఏవి తక్కినవాళ్ళు పాడినవి విడదీసి చూస్తే, ఓహో! చాలా కాలందాకా, జీవితపు ప్రతి మలుపులోనూ నా మనసుకి చుట్టుకున్న పాటలు సుశీల పాడినవే!

సుశీలస్వరమాధురి

కాని ఆ పసితనపు రోజుల్లో, ఆ పల్లెలో, మధ్యాహ్నాలూ, అర్థరాత్రులూ కూడా ఒకేలాంటి నిశ్శబ్దం ఆవరించి ఉండే ఆ అడివి మధ్య, విశాఖపట్టణం, విజయవాడ రేడియో స్టేషన్లనుంచి వినిపించే సినిమాపాటలే నేను విన్న తొలిసంగీతం. ఘంటసాల, సుశీల-ఈ రెండు పేర్లే నేను విన్న తొలిగాంధర్వం