పశ్చిమ గోదావరి జిల్లా అంటే నా చిన్నప్పడు కొంత వినీ, కొంత చూసీ ఊహించుకున్న మనోహర దృశ్యమొకటి నిన్నమొన్నటిదాకా నా కళ్ళముందు కదలాడుతూ ఉండేది. కాని అది నాకు తెలీకుండానే నెమ్మదిగా కరిగిపోతూ, చివరికి, మూడేళ్ళ కిందట కొల్లేరు వెళ్ళినప్పుడు పూర్తిగా అదృశ్యమైపోయింది. నామిత్రుడు, ప్రభుత్వంలో ఒక ఉన్నతాధికారి, ఆకివీడు మండలంలో ఒక పాఠశాల దత్తత తీసుకుని దాని రూపురేఖలు మార్చేసాడు. ఆ పాఠశాల చూడటానికి రెండేళ్ళ కిందట నన్ను తీసుకువెళ్ళినప్పుడు, పశ్చిమగోదావరి తీరప్రాంతం మొత్తం ఒక …