సెనెకా ఉత్తరాలు-14

ఈ విశ్వవివేచన నిజానికి ఒక నైతిక కార్యాచరణ. ఈ ప్రయత్నంలో మనిషి తన అల్పత్వం నుంచి బయటపడి ఉదాత్తమానవుడిగా రూపొందుతాడు. భీరుత్వం నుంచి బయటపడి ధీరుడిగా మారతాడు. నర-పశువు నరసింహుడిగా మారతాడు.

సెనెకా ఉత్తరాలు-13

ప్రతి సారీ నువ్వొక మనిషిని ద్వేషిస్తున్నప్పుడు, అతడి ఉనికిని ఏవగించుకుంటున్నప్పుడు, పరిశీలించుకో, నీలోని ఏ అవలక్షణానికి అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడో. ఆ అవలక్షణం నీదే. ఆ చప్పుడు నీలోని హీనపార్శ్వం చేస్తున్న చప్పుడు.

సెనెకా ఉత్తరాలు -12

ఒక మనిషికి సామాజికంగా లభించే గౌరవం అతడి వ్యక్తిత్వాన్ని బట్టి కాక అతను చేసే పనిని బట్టి లభించడం అనేది అత్యంత అనాగరిక లక్షణం.