కొండవీడు-3

అందుకనే నిజమైన విద్యార్థి, విద్యనెప్పటికీ, విద్యనుంచి, కాపాడుకుంటూనే ఉండాలి. అసలు టెక్నాలజీలన్నింటికీ ఆధారమైన సత్యాన్వేషణనే నిజమైన విద్య అనీ, మనుషులు కోరుకోవలసిందీ, అభ్యసించవలసిందీ అదేననీ యుగాలుగా విద్యావేత్తలంతా చెప్తూవస్తున్నారు.

కొండవీడు-2

కొండవీడులో చరిత్ర శిథిలాలు ఒక చిన్న అంశం మాత్రమే. ఆ కొండకొమ్ముల మీద తేలాడే ఆ మబ్బులముందు, మేఘాలముందు మనకి చరిత్ర గుర్తుకు రాదు. మీరు శ్రీనాథుడి కవిత్వం చదివి ఉంటే, ఆ పద్యాల్లోని loftiness ఎక్కడిదో తెలియాలంటే మాత్రం ఒకసారైనా కొండవీడు పోయి రావాలి.

కొండవీడు-1

నాకు చరిత్ర పట్ల ఆసక్తి లేదు. చరిత్ర ఎక్కడ పద్యంగా రూపుదిద్దుకుంటుందో ఆ స్థలాలపట్లనే నాకు మక్కువ. చరిత్రని దాటి ఎక్కడ పద్యం నిలబడుతుందో ఆ తావులకోసమే నేను తపిస్తాను. అక్కడ కొండవీడు ఘాట్ రోడ్ మలుపు తిరుగుతుండగా, రోడ్డుమలుపు తిరిగే గోడ మీద శ్రీనాథుడి పద్యమొకటి, ఈ మధ్యనే అక్కడ రాసిపెట్టింది, చప్పున నా దృష్టిని ఆకర్షించింది.