కవిగా ఆయన సర్వోన్నతుడు, కాని మనిషిగా బలహీనుడు, ఎంత మహావిషాదాన్ని చూసినా కూడా తన జీవితేచ్ఛ చల్లారని వాడు. 'పొద్దుటిపూట దీపంలాగా ఏ క్షణాన్నైయినా కొండెక్కేలాగా ఉంది' తన జీవితమని ఒక ఉత్తరంలో రాసుకున్నాడుగాని, ఆ నిశాంతవేళ కూడా సాయంసంధ్యాదీపంలాగా ప్రజ్వరిల్లాలనే తపించాడు.
మోహనరాగం: దాశరథి కవిత
'ఏను కవితన్ వరియించలేదు, తానె వరియించె కవితల రాణి నన్ను' అని గానం చేసిన దాశరథి కవిత్వాన్ని తలుచుకుంటూ 'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు 2007 లో చేసిన ప్రసంగం.
మామిడికొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే
మామిడిచెట్టు ఏడాదిలో ఆరునెలలు నిద్రపోతుంది. ఆరునెలలు పరిపూర్ణంగా జీవిస్తుంది. పూర్తి ఉత్సాహంతో, మహావైభవంతో జీవిస్తుంది. మాఘమాసంలో పూత, ఫాల్గుణంలో పిందె, వైశాఖంలో రసాలూరే ఫలాలు-ఇంత త్వరత్వరగా పుష్పించి, ఫలించే ఈ వైనం ఒక సంస్కృతకవికి ప్రేమవ్యవహారంలాగా అనిపించింది