సాహిత్యసేవకుడు

కృష్ణారావుగారు ఒక సామాజిక చరిత్రసంపుటి, సాహిత్యచరిత్రసంపుటి, కానీ, తానో మరొకడో ఎవరో ఒకరు మటుకే జీవించవలసివస్తే తన తోటిమనిషికి జీవితావకాశాల్ని అందించి తాను వెనకవరసలో నిలబడిపోగలిగిన వ్యక్తి.

సి.వి.కృష్ణారావుగారు

కృష్ణారావు గారు 90 వ ఏట అడుగుపెట్టినప్పుడు నేను రాసింది చదివి మీరంతా ఎంతో ఆత్మీయంగా ప్రతిస్పందించారు. ఆ అభిమానం, ఆ స్నేహస్పందన ఆయనకు కొత్త ఉత్సాహాన్నిస్తాయనే అనుకుంటూ, ఈ సారి జూలై 3 న ఆయన 91 వ ఏట అడుగుపెట్టినప్పుడు మళ్ళా ఆయన్ను పలకరించాలనుకున్నాం. అందుకని శుక్రవారం సాయంకాలం, సోమయ్యగారూ, గంగారెడ్డీ, నేనూ కృష్ణారావుగారి ఇంటికి వెళ్ళాం.