కరమజోవ్ సోదరులు

ఆ ప్రశ్నకి జవాబుగా డాస్టవిస్కీ ఒకటి కాదు, రెండు కాదు, అయిదు నవలలు రాసాడు. ఆ అయిదింటినీ కలిపి డాస్టొవిస్కీ రాసిన అయిదంకాల విషాదాంతనాటకంగానూ, Notes from Underground ను ఆ నాటకానికి ప్రస్తావనగానూ విమర్శకులు అభివర్ణిస్తున్నారు. ఆ అయిదు అంకాల్లో బ్రదర్స్ కరమజోవ్ చివరి అంకం, అత్యంత నాటకీయమైన అంకం.