నా ప్రభువుని సిలువవేసినప్పుడు

మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1959 లో భారతదేశంలో పర్యటించినప్పుడు వినోబా భావేని కూడా కలుసుకున్నప్పటి ఒక అపురూపమైన సంఘటనని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ రాసిపెట్టుకున్నారు.  డా.కింగ్ తన సతీమణితో వినోబాని చూడటానికి వెళ్ళినప్పుడు కొంతసేపు సంభాషణ సాగాక వారితో పాటు ఉన్న ఒక మతాచార్యుడు కొన్ని ఆఫ్రికన్ అమెరికన్ ఆధ్యాత్మికగీతాలు ఆలపించవలసిందిగా డా.కింగ్ సతీమణిని కోరాడు.