ఆ వెలుగునీడలు తెలియాలి

బహుశా కథ మొదలయిన తర్వాత, పాత్రలు నా మాట వినకపోవచ్చు. నేనే ఒక ప్రేక్షకుడిలాగా ఆ పాత్రల గమనాన్ని నిశ్చేష్టుణ్ణై చూస్తూండవచ్చు. కాని నాకు తెలియవలసింది, ఆ స్థలం, ఆ కాలం, ఆ వెలుగునీడలు.