మార్దవ సంవేదన

ఆ పుస్తకం మొత్తం చదివేటప్పటికి, హైని నిజంగా ప్రేమించింది ఒకే ఒక్కరిని, అది జర్మన్ భాషని మాత్రమేనని అర్థమయింది. ఇక జడ్జిగారు నన్ను లోపలకి పిలిచేటప్పటికి నేను కూడా తెలుగు భాషని ప్రేమించడమెట్లా అన్న ఊహల్లో తేలిపోతూ ఉన్నాను.

భవాబ్ధిపోతం

భవాబ్ధి పోతం చదివేవారు అదృష్టవంతులు. చదివి మననం చేసుకునేవారు సంస్కారవంతులు. మననం చేసుకుని నలుగురికీ చెప్పేవారు సుకృతులు. ఆచరించేవారు పరమభాగవతోత్తములు.