యాభై తొమ్మిది సెకండ్ల సుదీర్ఘ కాలవ్యవధి

సత్యాన్ని తరచి చూడటానికి ఉపనిషత్తులు వాడుకున్న పరికరం 'నేతి నేతి ' అన్నది ఎంత శక్తిమంతమైందో, ఆయన క్రైస్తవ పరిభాషలో వివరిస్తుంటే, వినడానికి ఎంతో ఆసక్తి కరంగా ఉంటుంది. జెన్, సూఫీ వంటి మిస్టిక్ సంప్రదాయాలతో పాటు క్రైస్తవ మిస్టిక్కుల్ని ఆయన అర్థం చేసుకున్న తీరులోనే గొప్ప సాధికారికత కనిపిస్తుంది.

రసగుళికలు

ఈ కవిత్వాన్ని ఏదో ఒక గాటన కట్టి ఉపయోగం లేదు. ఆ 'నువ్వు' ఎవరు అని శోధించీ ప్రయోజనం లేదు. ఒక్కటి మాత్రం చెప్పగలను. ఇది ప్రేమ కవిత్వం కాదు, ధ్యాన కవిత్వం. ఇది వసుధారాణికి 'తెలిసి', ప్రయత్నపూర్వకంగా రాసిన కవిత్వం కాదు. ఎన్నో జన్మలనుండీ ఆమెని అంటిపెట్టుకుని వస్తున్న ఏ జననాంతర సౌహృదాల కస్తూరిపరిమళమో ఇట్లా ఒక్కసారిగా గుప్పుమంది.