వేదన వెలుగుగా మారినవేళ-1

అక్కడ అడుగుపెడుతూనే ముందు స్ఫురించిన మాట, ఆమె దేవతగా మారిన కవయిత్రి అని. నేను కూడా కవినే కదా! కాని నేనెందుకు ఇంకా మనిషిగానే మిగిలిపోయాను? ఎంత ప్రయత్నించినా ఏదో ఒక వేళ దానవుణ్ణి కాకుండా ఉండలేకపోతున్నాను?

సిరినోము

ప్రతి ధనుర్మాసంలోనూ ఆండాళ్ తల్లినీ, తిరుప్పావైనీ తలుచుకోవడం నాక్కూడా చాలా ఏళ్ళుగా ఒక వ్రతంగా ఉంటున్నది. ఈసారి కూడా, మీతో తిరుప్పావై గురించి నా ఆలోచనలు పంచుకుందామని ఉంది.

సిరినోము

అన్నిటికన్నా ముందు తిరుప్పావై ఒక శుభాకాంక్ష. అన్నిటికన్నా ముందు ఇహలోక సంతోషాన్ని అపరిమితంగా అభిలషించిన ఆకాంక్ష. కాని ఇహలోక సంతోషానికి ద్యులోకకాంతి తప్పనిసరి అని కూడా గ్రహించినందువల్లనే, ఆ పాటలో అంత వెలుగు