రాధాకృష్ణన్ చేసిన పోరాటం వీటన్నిటికన్నా భిన్నమైంది, మరింత సూక్ష్మమైంది. ఆయన సత్యాగ్రహం చెయ్యలేదు, జైలుకు వెళ్ళలేదు, పైగా ఆ కాలమంతా పుస్తకాలు చదువుకుంటున్నాడు, పాఠాలు చెప్పుకుంటున్నాడు. కాని తక్కినవారు భారతదేశాన్ని రాజకీయంగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంటే, ఆయన ఒక దార్శనిక భారతదేశాన్ని ప్రపంచపటం మీద ఆవిష్కరిస్తో ఉన్నాడు