యుగయుగాల చీనా కవిత-16

తావో యువాన్ మింగ్ కవిత్వం చదివినప్పుడు సంస్కృత సాహిత్యవేత్తలకు వాల్మీకి, కాళిదాసులు వర్ణించిన తపోవన సంస్కృతి గుర్తొస్తుంది. తమిళ సాహిత్య విద్యార్థికి అవ్వైయ్యారూ, తిరువళ్ళువరు గుర్తొస్తారు. గ్రీకు సాహిత్య విద్యార్థికి థియోక్రిటస్ గుర్తొస్తాడు. లాటిన్ సాహిత్యవేత్తకు వర్జిల్ రాసిన ఎకొలాగ్స్ గుర్తొస్తాయి. అమెరికన్ సాహిత్యవిద్యార్థికి రాబర్ట్ ఫ్రాస్ట్ గుర్తొస్తాడు. ఇక అన్నిటికన్నా మించి తెలుగు సాహిత్యాభిమానులకు బమ్మెర పోతన గుర్తొస్తాడు. ఆయన రాసిన 'ఇమ్మనుజేశ్వరాధముల' పద్యం గుర్తొస్తుంది.