మొగలిపూలగాలి

నీళ్ళునింపుకున్న కడవల్లాంటి నల్లమబ్బులు నింగిలో కనబడగానే భారతీయకవులు లోనైన రసపారవశ్యంలో సంతోషం, దిగులు, ప్రేమించినవాళ్ళనుంచి ఎడబాటు, ఎడబాటు తీరుతుందన్న కోరిక-ఎన్నో భావాలు వ్యక్తం కావడానికి వాల్మీకి రామాయణంతోనే మొదలు.

రెండు ముల్లై కవితలు

ఇరవయ్యేళ్ళకిందట చైనా కవిత్వాన్ని మొదటిసారి చదివినప్పుడు చాలా ఏళ్ళే నేనో విభ్రాంత లోకంలో గడిపాను. కాని పదిపదిహేనేళ్ళ కిందట మొదటిసారి ఎ.కె.రామానుజన్ 'పొయెమ్స్ అఫ్ లవ్ అండ్ వార్ ' చదివినతరువాత చీనా కవిత్వంకన్నా ప్రాచీన కవిత్వం మన పక్కనే వికసించిందని తెలిసినప్పటినుంచీ ప్రాచీన తమిళ సంగం కవిత్వానికి నేను గాఢాభిమానిగా మారాను.

రామాయణ పర్వతశ్రేణి

మీకు కొండలంటే చాలా ఇష్టమల్లే ఉందనుకుంటాను అన్నారు గణేశ్వరావుగారు, నా 'కొండమీద అతిథి' పుస్తకం చూసి. 'అవును, మాది కొండ కింద పల్లె' అని ఒకింత గర్వంగానే చెప్పాను గాని, ఆ వెంటనే సిగ్గుపడ్డాను కూడా. నిజంగా కొండల్ని ప్రేమించవలసినంతగా ప్రేమిస్తున్నానా నేను?