నేను కూడా భాగస్వామిని

కాని ఎన్నో సమస్యల మధ్య, ఒడిదుడుకుల మధ్య, మహమ్మారి ఎదట, పాఠశాల విద్యాశాఖ చేపట్టిన అద్భుతమైన కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామిని కావడం నిజంగా జన్మసార్థక్యంగా భావిస్తున్నాను.

రెల్లు, రెల్లు, రెల్లు

కృష్ణప్రేమికులు ఆ రెల్లు గడ్డిని తలుచుకుని ఎందుకంత వివశులైపోతారో అర్థమయింది. చూడగా చూడగా ఆకాశం రెల్లుని పూసిందనీ, నదులూ, వాగులూ, వంకలూ, నెర్రెలూ, దొరువులూ మేఘాల్ని పూసాయనీ గ్రహించాను.

రాతిమద్దెల

అడవిదారిన రాజూ, కవీ ప్రయాణిస్తున్నారు మధ్యాహ్నపు మగతనీడలో మద్దిచెట్ల నీడన రాజు కలగన్నాడు కవి పాటపాడాడు.