నా ఫిర్యాదులు ఎవరికి చెప్పుకోను? ఈ కటకట ఎప్పుడు ముగిసిపోతుంది? నేను చేజేతులా తగిలించుకున్న ఉచ్చు దీన్నుంచి నన్ను బయటపడేసేదెవరు?
మరో నాలుగు పుస్తకాలు
ఇప్పుడు నా రచనలలో సరికొత్తగా మరో నాలుగు పుస్తకాలు మొన్ననే ప్రింటు కాపీలు విడుదల అయ్యాయి. Shri Pada Literary Works వారు వెలువరించిన నాలుగు పుస్తకాలూ ఇవి. ఇందులో బసవన్న వచనాలు కిందటేడాది వెలువరించినప్పటికీ ఆ 100 కాపీలు అయిపోవడంతో, చాలామంది మిత్రులు పదేపదే అడుగుతుండటంతో, ఆ పుస్తకం కూడా మరోసారి ముద్రించి విడుదల చేస్తున్నారు. ఒక్కొక్క పుస్తకం 100 కాపీల చొప్పున మాత్రమే ప్రింటు చేయించారు కాబట్టి ఆసక్తి ఉన్నవారు తెప్పించుకోవచ్చు.
మెలకువ వచ్చినప్పుడు
కోకిల ప్రవేశించే కాలం (2009) నుంచి మరో కవిత, నా ఇంగ్లిషు అనువాదంతో.
