మార్కస్ అరీలియస్ మెడిటేషన్స్ పైన నేను చేసిన రెండో ప్రసంగం పైన మాధవిగారు వారి అమ్మాయికి రాసిన ఉత్తరం ఇది. ఇంతకు ముందు మీతో పంచుకున్న మొదటి ఉత్తరానికి ఇది కొనసాగింపు.
జయగాథల సంపుటం
రెండుమూడు రోజుల కిందట కృష్ణకుమారిగారి వాల్ మీద చూసాను. ఆమె పుస్తకాల స్టాలు దగ్గరకు వచ్చిన ఒక సందర్శకుడు ఈ పుస్తకం పేజీలు కొన్ని తిరగేసి తన మిత్రుడితో 'ఇది వ్యక్తిత్వ వికాస గ్రంథంలాగా ఉంది' అని అన్నాడట. ఆ మాటలో చాలా నిజముంది. వ్యక్తిత్వ వికాస గ్రంథం అనే కన్నా, జయగాథల సంపుటం అనడం మరింత సముచితంగా ఉంటుంది.
ఇంతకన్నా మరేం కావాలి?
తెలుగు వెంకటేష్ కి, కర్నూల్లో ఒక ఫుట్ పాత్ మీద, సెకండ్ హాండు పుస్తకాల మధ్య, నా నీటిరంగుల చిత్రం కవిత్వం దొరికిందని విన్నప్పుడు. ..
