ఈ నేపథ్యంలో 1941 లో మహాత్ముడు ప్రకటించిన నిర్మాణాత్మక కార్యక్రమం ఎంత శక్తిమంతమైందో నాకు అర్ధమవుతున్నది. దాన్ని మనం కేవలం ఒక కలగా కొట్టిపారేసినందువల్ల, రాజ్యాంగ కర్తలు దాన్నొక ఆదేశసూత్రానికి పరిమితం చేసినందువల్ల మనం రాజకీయంగానూ, అభివృద్ధిపరంగానూ కూడా ఎంత నష్టపోయామో ఇప్పుడిప్పుడే అంచనాకు వస్తున్నది.
