మహోన్నత కళా తపస్వి

ఒకసారి సీతానగరం సత్యాగ్రహ ఆశ్రమానికి వెళ్తూ గాంధీజీ రాజమండ్రిలో భగీరధిగారి చిత్రలేఖనప్రదర్శన ప్రారంభించారని తెలియడమే ఒక సంతోషం. అటువంటిది ఆయన భగీరధి గీసిన ఒక లాండ్‌స్కేప్‌ చూసి, ఆ చిత్రంలో కనిపిస్తున్న మంచుకి, తనకి చలి పుడుతున్నదని చెప్పారంటే, అంత సత్యసంధుడి నోటివెంట అంత ప్రశంస వెలువడిందంటేనే ఆ చిత్రకారుడి కౌశల్యమెటువంటిదో మనం ఊహించవచ్చు.