రోజూ చూస్తుంటాను
స్విగ్గీలు, బ్లింకిట్లు, జెప్టోలు, జొమేటోలు
ఈ నగరాన్ని
తమ భుజాల మీద మోస్తుంటాయి.
రాపిడోలో, ఊబర్లలో
ప్రతి రోజూ నల్గొండ
ఈ నగరాన్ని నడిపిస్తుంటుంది.
పాలమూరు ప్రతిరోజూ ఈ నగరాన్ని
తుడిచి శుభ్రం చేసి కడిగి బోర్లిస్తుంది.
ఒరిస్సా వీథులూడుస్తుంది
బీహారు సపర్యలు చేస్తుంది.
కాని ఈ ఒక్కరోజు కథ వేరే.
ఇవాళ నగరాన్ని గాలిపటాలు ఎగరేసుకుపోతున్నాయి
తొలిమామిడిపూతగాలి గుండెనిండుగా పీల్చుకుని
నగరం ఈ ఒక్క రోజుకి
గ్రామంగా మారిపోయింది.
14-1-2026

భలే..
ఆంధ్రా ట్రాఫిక్ ను స్తంభిస్తుంది మర్చిపోయారు.. 🙂
ధన్యవాదాలు సార్
సంక్రాంతి శుభాకాంక్షలు.
మీకూ, మీ కుటుంబ సభ్యులకూ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.💐
సంక్రాంతి కానుక సార్
రోజూ చూస్తుంటాను
స్విగ్గీలు, బ్లింకిట్లు, జెప్టోలు, జొమేటోలు
ఈ నగరాన్ని
తమ భుజాల మీద మోస్తుంటాయి.
🙏✨💐గురువుగారు
మీకూ, మీ కుటుంబ సభ్యులకూ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.💐
నగరం పండుగలప్పుడైనా పల్లెను గుర్తు చేస్తూ సహజత్వానికి దగ్గరవుతున్నది.
మీకూ, మీ కుటుంబ సభ్యులకూ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.💐
నగరాన్ని బస్సులు, రైళ్లు, ఎగరేసుకుపోయాయి నాలుగు రోజులపాటు..
మీకూ, మీ కుటుంబ సభ్యులకూ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.💐
సంక్రాంతి కానుక
మీకూ, మీ కుటుంబ సభ్యులకూ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.💐