పరుసవేది

ఆ పసుపుపూలచెట్టు
నిండుగా వికసించిందని చెప్పవచ్చు.
కాని అది నా చుట్టూ
సృష్టిస్తున్న ప్రకంపనల్ని
పూర్తిగా వివరించినట్టు కాదు.

అది అడ్డగిస్తున్నది, తానేది కాదో
ఆ ప్రతి ఒక్కదాన్నీ నిరోధిస్తున్నది
తనున్నంతమేరా మరేదీ వ్యాపించకుండా
ఒక రాజ్యం సాగిస్తున్నది.

ఆ చెట్టు స్థిరంగా నిలబడిందనుకోవచ్చు.
కాదు, అది అనుక్షణం చలిస్తున్నది.
రోజూ కొంతసేపేనా ఆ జ్వాల
నన్ను తనలోకి లాక్కుంటున్నది.

నేను నడుస్తున్నాననీ
ఆ చెట్టు ఉన్నచోటనే
నిశ్చలంగా నిలబడిందనీ అనుకోవచ్చు
కానీ దాని వేళ్ళు నా రోజువారీ జీవితం కిందకీ
చొచ్చుకొస్తున్నవి.
ఆ కొమ్మల్లో, ఈనెల్లో, పూలరేకల్లో
సూర్యకాంతి వర్షించినప్పుడల్లా
నాలోపలకీ ఏదో ప్రసరిస్తున్నది.

మట్టిని బంగారంగా మార్చడమెలానో
ఆ చెట్టుకి తెలుసని చెప్పవచ్చు
కానీ అది తన చూపరిని కూడా
బంగారంగా మార్చగలదని ఇప్పుడే తెలుస్తున్నది.

13-1-2026

19 Replies to “పరుసవేది”

  1. “ ఆ కొమ్మల్లో, ఈనెల్లో, పూలరేకల్లో
    సూర్యకాంతి వర్షించినప్పుడల్లా
    నాలోపలకీ ఏదో ప్రసరిస్తున్నది”
    “ తన చూపరిని కూడా
    బంగారంగా మార్చగలదని ఇప్పుడే తెలుస్తున్నది”
    🙏🏽

  2. మట్టిని బంగారంగా మార్చే పరుసవేది పచ్చపూలచెట్టు ఆ హా ఇదేకదా రవిగాంచనిది కవిగాంచునది . నమస్సులు .

  3. ఈ కవితకి మీరు పెట్టిన పేరులోనే ఉంది కదా భద్రుడు గారు, ఆ మహత్యం… అద్భుతః

  4. Good morning sir, iam Srinidhi today your poem is very nice .
    Happy bhogi &, Pongal to you & your family members from Srinidhi dept of heritage employee

  5. నమస్తే సార్, మీ కుటుంబ సభ్యులకూ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.❤️❤️❤️

  6. నిజమే… చూపరిని కూడా బంగారంగా మార్చే మహత్తు మీ అక్షరాలకి ఉంది. నమస్సులు

  7. ఆ పూల చెట్టు మరెవరో కాదు మీరే! సంక్రాంతి శుభాకాంక్షలు.

    1. మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాతి శుభాకాంక్షలు…

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading